Tue. Dec 10th, 2019

ద్రాక్షారామంలో భీమేశ్వరుడు

m, east godavari district, pancharamam

m, east godavari district, pancharamam

Draksharamam-Nandi
Draksharamam-Nandi

ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఒడ్డున ద్రాక్షారామం ఉంది. ఈ పుణ్య క్షేత్రం పంచారామాల్లో ఒకటి. స్వామివారు భీమేశ్వరుడు, అమ్మ వారు మాణిక్యాంబ … క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు . శివాల యంతో పాటు విష్ణ్వాలయం, శక్తి పీఠం ఉన్న దివ్య క్షేత్రం ద్రాక్షారామం లేదా దక్షారామం . దక్ష ప్రజాపతి ఇచ్చట యజ్ఞం చేసాడని ప్రసిధ్ది.

భీమేశ్వర ఆలయం ద్రాక్షారామం పంచారామాలలో ఒకటిగానే కాదు, అష్టాదశ శక్తి పీఠాల్లొ ఒకటిగా, త్రిలింగ క్షేత్రంగా, దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచింది. ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో క్రీ.శ. 892-922 మధ్య నిర్మితమైంది. ఆలయ స్థంభాలపై, గోడలపై శాసనాలున్నాయి. భీమేశ్వర స్వామి లింగరూపంలో 14 అడుగుల ఎత్తు వుంటాడు. లింగం సగభాగం నల్లగా, మిగిలిన సగభాగం తెల్లగా ఉంటుంది.

పౌరాణిక గాధ: తారాకాసురుని కంఠంలో అమృత లింగం వుందేది. అది వుండగా అతన్ని జయించలేరని దానిని ఛిన్నం చేయడానికి దేవతలు కుమారస్వామిని ప్రార్ధించారు. కుమారస్వామి దెబ్బకు అది 5 ముక్కలైంది. ఒకటి ద్రాక్షారామంలో, రెండవది అమరారామం (అమరావతి) లో, మూడవది క్షిరారామం (పాలకొల్లు) లో, నాలుగవది సోమారామం (గుణుపూడి, భీమవరం) లో , అయిదవది కుమారారామం (సామర్లకోట దగ్గరగల భీమవరం) లో పడ్డయట. పూర్వం దక్షప్రజాపతి నివసించిన ప్రదేశం ఇది. అందుకే దక్షారామం అయింది. అలాగే ద్రాక్ష తోటలు ఎక్కువ వుండేవి, అందుకని ద్రాక్షారామం అన్నారు.

భీమేశ్వర ఆలయం పంచారామాలలో ఒకటిగానే కాదు, అష్టాదశ శక్తి పీఠాల్లొ ఒకటిగా, త్రిలింగ క్షేత్రంగా, దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ మూల విరాట్ట్ బీమేశ్వర స్వామి కాగా, అమ్మవారు దాక్షాయిణి. భీమేశ్వర స్వామి స్వయంభు లింగరూపంలో 14 అడుగుల ఎత్తు వుంటారు. లింగం సగభాగం నల్లగా, మిగిలిన సగభాగం తెల్లగా ఉంటుంది. అర్ధనారీశ్వరుడు నతానికి ఇదొక నిదర్శనం. ఆలయంలో క్రింద దర్శన అనంతరం పై అంతస్తులో పూజాదికాలతో మళ్లీ దర్శనం చేసుకుంటారు. అంటే రెండు అంతస్తులలో వుంటుంది. ఇక్కడ లక్ష్మి నారాయణుడు క్షేత్రపాలకుడిగా వున్నాడు. ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో క్రీ.శ. 892-922 మధ్య నిర్మితమైంది. ఆలయ స్థంభాలపై, గోడలపై శాసనాలున్నాయి. శాసనాలుచారిత్రిక పరిశోధకులకు పెన్నిధి వంటివి. ఇలాంటి శాసనాల ఆధారంగా చేసిన పరిశోధనల ద్వారానే పూర్వ చరిత్ర తెలుస్తుంది.

గుడి లోపలి ప్రాంగణంలో వీరముడి ఆంజనేయ స్వామి విగ్రహం వుంది. స్వామి జుట్టు ముడి వేసి కొప్పులాగా వుంటుంది. అందుకే ఆ పేరు. గద లేదు. నమస్కార ముద్రలో వుంటాడు. ప్రక్కనే ఒకే పానవట్టంమీద 108 చిన్న చిన్న శివ లింగాలు వుంటాయి. దాన్ని దర్శిస్తే అన్ని శివాలయాలూ చూసినంత ఫలమట. ఇక్కడ నవగ్రహ మండపమే కాక అష్ట దిక్పాలకులకూ మండపం వుంది. బహుశా దీన్ని ఇక్కడే చూస్తామేమో. ఏకశిలలో మలచిన నమూనా దేవాలయం ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు. అష్టదిక్పాల మండపానికి ఎదురుగా వున్న స్వామి ప్రధాన ఆలయ మార్గాన్ని చీకటికోణం అని పిలుస్తారు. ఇందులో మూడు ప్రాకారాలున్నాయి. అందులో మొదటి రెండు ప్రాకారాలలో గోడలకి బొడిపలు కనబడతాయి. పూర్వం అక్కడ నవరత్నాలు పొదగబడి వుండటంవల్ల ఆ ప్రదేశమంతా కాంతిమయంగా వుండేదట. నాలుగు ప్రవేశ ద్వారాలతో ఆలయ బాహ్యప్రాకారం ఎత్తైన రాజగోపురాలతో నిర్మితమైంది. బాహ్యప్రాకారంలో కాలభైరవాలయం, త్రికూటాలయం ఉన్నాయి. ధ్వజ స్ధంభం ముందు రావి- వేప వృక్షాలున్నాయి. ఆ చెట్లనీడలో శివలింగం, విష్ణు విగ్రహం ఉన్నాయి. రెంటినీ శంకరనారాయణ స్వాములని పిలుస్తారు.

ఇక్కడ అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లొ ద్వాదశ శక్తి పీఠంగా మాణిక్యాంబ రూపంలో భక్తులను అనుగ్రహిస్తుంది. మిగతా శక్తి పీఠ క్షేత్రాలకు, ద్రాక్షారామంలోని మాణిక్యాంబ శక్తి పీఠానికి ఒక భిన్నమైన విశిష్టత వుంది. దాదాపు అన్ని శక్తి పీఠ క్షేత్రాలలో అమ్మవారి విగ్రహం ఒకచోట, శ్రీచక్ర యంత్రం మరోచోటా వుంటాయి. కానీ ద్రాక్షారామంలో మాణిక్యాంబదేవిని శ్రీచక్ర యంత్రంపై ప్రతిష్టించడం వల్ల శ్రీచక్రయంత్రానికి, అమ్మవారికీ ఏకకాలంలో పూజలు జరుగుతుంటాయి. ఈ క్షేత్రంలో యంత్రం వేసి అమ్మవారిని ప్రతిష్టించడం విశేషం.

1 thought on “ద్రాక్షారామంలో భీమేశ్వరుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *