Thu. Nov 14th, 2019

కారంపూడి వీరుల ఉత్సవాలు

Lorem ipsum dolor sit amet,sed diam nonumy eirmod tempor invidunt ut labore et dolore magna aliquyam erat, At vero eos et accusam et justo duo dolores et ea rebum. Lorem ipsum dolor sit amet, no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. Stet clita kasd gubergren, no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. sed diam voluptua.

వీరులగుడి 12 వ శతాబ్ధంలో పల్నాటి యుద్ధం ముగిసిన తరువాత బ్రహ్మనాయుడు ఆశయసిద్ది కోసం యుధ్దంలో మరణించిన 66 వీరనాయకులకు గుర్తుగా 66 వీరకల్లును ప్రతిష్ఠించి వీరాచారపీఠం స్థాపించి దానికి పిడుగు వంశంవారిని పీఠాధిపతిగా నియమించారు. యుద్ధంలో మరణించిన వీరులకు దైవత్వాన్ని ఆపాదించి, ఆయధాలకు పూజలు-ఉత్సవాలు రోమ్ తరువాత కారంపూడి లోనే జరుగుతాయి. 800 ఏళ్లుగా పల్నాటి యుద్ధానంతరం అందులో పాల్గొన్న వీరనాయకులకు ఆరాధనోత్సవాలు నిర్వహించటం పరిపాటిగా మారింది. బ్రహ్మన్న స్థాపించిన సమసమాజాన్ని రక్షించేందుకు ఈ ఆచారాన్ని ఏర్పాటు చేశారు. శతాబ్దాల
చరిత్రకు తార్కాణం వీరారాధనోత్సవాలు.దాయాదుల సమరంతో మహాభారతంతో సమానంగా చరిత్రపుటల్లో ఎనలేని ఖ్యాతి గడించింది పల్నాటి చరిత్ర. సమర క్షేత్రంలో అలనాటి వీరనాయకులకు ప్రతీకగా ఉన్నఆయుధాలకు (కొణతాలు) పూజలు నిర్వహించటం, వారి పేరుతో ఆరాధనలు చేయటం పరిపాటిగా వస్తోంది.

ఆ వీరకల్లులు, వీరాచారపీఠం ఉన్నదే వీరులగుడి.గుడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని కారంపూడిలో నాగులేరు ఒడ్డున కలదు. .పల్నాటి యుద్ధానికి అనేక కారణాలున్నాయి. అనుగురాజు పల్నాట గురజాలను రాజ్యంగా చేసుకొని బ్రహ్మనాయుని మంత్రివర్గంలో పాలించిన సమయంలో నాగమ్మ ఆతిధ్యం స్వీకరించి కానుకను కోరుకోమనటం,అనంతర కాలంలో అనుగురాజు కొడుకైన నలగాముడి పరిపాలనలో కానుకగా మంత్రి పదవిని నాగమ్మ
అడగటంతో పల్నాడు చరిత్రకు అంకురార్పణ జరిగింది. అప్పటికే వైష్ణవం ద్వారా ప్రజల్లో సమసమాజ స్థాపనకు బ్రహ్మన్న సుస్థిర స్థానం పొందాడు. ఇదే క్రమంలో శైవాన్ని ప్రబోధిస్తూ నాగమ్మ పల్నాట ముఖ్యస్థానంసంపాదించింది. ఈ క్రమంలో పల్నాడు రాజ్యం రెండు ముక్కలైంది. అనుగురాజు మొదటి భార్య సంతానమైన నలగామునికి గురజాల, రెండో భార్య సంతానమైన మలిదేవాదులకు మాచర్ల రాజ్యంగా పంపకాలు జరిగాయి. ఇరురాజ్యాల మధ్య కోడిపోరుతో కక్షలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మండాది వద్ద ఆలుమందలను అంతమొందించే క్రమంలో లంకన్న ఒరగటం, నలగాముని అల్లుడు అల్లరాజు మృతి పల్నాటి యుద్ధానికి దారి తీసింది. బ్రహ్మన్న దత్తపుత్రుడు కన్నమనీడు నేతృత్వంలో బాలచంద్రుడు తదితర 66 మంది నాయకులు ఈ పల్నాటి యుద్ధంలో అసువులు బాశారు. చివరి అంకంలో బ్రహ్మన్న, నాగమ్మలు కత్తులు దూసినప్పటికీ వైరాగ్యంతో బ్రహ్మన్న గుత్తికొండ బిలంలోకి ప్రవేశించటం, నాగమ్మ మంత్రిగా నలగామునితో రాజ్యం చేయించటంతో పల్నాటి యుద్ధం ముగిసింది. 800 ఏళ్లుగా పల్నాటి యుద్ధానంతరం అందులో పాల్గొన్న వీరనాయకులకు ఆరాధనోత్సవాలు నిర్వహించటం పరిపాటిగా మారింది. బ్రహ్మన్న స్థాపించిన సమసమాజాన్ని రక్షించేందుకు ఈ ఆచారాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో చెన్నకేశవస్వామి దేవాలయాలను మాచర్ల, కారంపూడిల్లో ఏర్పాటు చేసి చాపకూటిని ప్రవేశపెట్టాడు.

అదే తీరున ప్రస్తుతం బ్రహ్మన్న ద్వారా ఆచారాన్ని పొందిన పిడుగు వంశీకులు చాపకూడు, వీరారాధన ద్వారా నిలుపుతున్నారు. ప్రతియేటా వీరారాధనోత్సవాలుఘనంగా జరుగుతాయి.

శతాబ్దాల చరిత్రకు తార్కాణం వీరారాధనోత్సవాలు.దాయాదుల సమరంతో మహాభారతంతో సమానంగా చరిత్రపుటల్లో ఎనలేని ఖ్యాతి గడించింది పల్నాటి చరిత్ర. సంకుల సమరంలో ఎందరో వీరనాయకులు అసువులు బాసిన కార్యమపూడి నేటి కారంపూడి. సమర క్షేత్రంలో అలనాటి వీరనాయకులకు ప్రతీకగా ఉన్న ఆయుధాలకు (కొణతాలు) పూజలు నిర్వహించటం, వారి పేరుతో ఆరాధనలు చేయటం పరిపాటిగా వస్తోంది. కార్తీక అమావాస్య నాడు ప్రారంభమయ్యే ఆరాధనోత్సవాలు ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు.పల్నాట శైవ, వైష్ణవ సంప్రదాయాలను నింపటం కోసం పల్నాడు యుద్ధానికి బీజాలుపడ్డాయి. క్రీ.శ. 1187లో పల్నాడు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో గురజాల, మాచర్ల రాజులైన నలగాముడు, మలిదేవాదులు తలపడ్డారు. శైవం కోసం నాగమ్మ, వైష్ణవం కోసం బ్రహ్మనాయుడు వర్గాలు రణక్షేత్రంలో కరవాలాలను ఝుళిపించాయి. ఒకరిపై ఒకరు ఎత్తులు వేసుకుంటూ, ప్రజాసంక్షేమాన్ని కాపాడుతూ పల్నాటి యుద్ధానికి అతిరథులు బీజం వేశారు. ఇరురాజ్యాలకు మధ్యనున్న కారంపూడిని రణక్షేత్రంగా ఎంచుకొని కత్తులు దూశారు. పల్నాటి యుద్ధంలో
గెలిచిన వీరులు తమ ఖడ్గాలను నాగులేరులో పుణ్యస్నానాలు చేసి శుభ్రపర్చుకున్నట్లుచరిత్ర చెబుతుంది. మొదటిరోజు రాచగావు: రాజు ఇచ్చే బలిని (నోటితో కొరికి మేకపోతును చంపటం) రాచగావుగా పిలుస్తారు. బలిని పోతురాజుకు ఇవ్వటం ద్వారా పల్నాడు వీరారాధనోత్సవాలకు తెరలేస్తుంది. రాష్ట్రంలోని 11 జిల్లాలోని ఆచారవంతులు తమ కొణతాలు (దైవాలు) తీసుకొని కారంపూడిలోని వీర్లదేవాలయం చేరతారు. రెండోరోజు రాయబారం: అలరాజు కోడిపోరులో ఓడిన మాచర్ల రాజ్యాన్ని తిరిగి మలిదేవులకు అప్పగించాలని గురజాల రాజు నలగాముని వద్దకు సంధికి వెళతాడు. ఈ క్రమంలో నాగమ్మ ప్రభావంతో తంబళ్ళ జీయర్‌ ద్వారా
చర్లగుడిపాడు వద్ద హత్యకు గురవుతాడు. ఆనాటి హత్యాకాండను వీరవిద్యావంతులు ఆలపిస్తుంటారు. ఈక్రమంలో ఆచారవంతులు అవేశపూరితంగా కత్తిసేవ చేస్తుండటం నేటికి దర్శనీయమే. మూడోరోజు మందపోరు: కోడిపోరులో రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలైన మలిదేవాదుల వద్ద ఉన్న ఆవులను అంతమొందించేందుకు నాగమ్మ పన్నాగం ద్వారా అడవి చెంచులు దాడి చేసే క్రమంలో లంకన్న అసువులు బాస్తాడు. లంకన్నకు శంఖుతీర్ధం ఇవ్వటం ద్వారా విముక్తిని బ్రహ్మన్న ప్రసాదిస్తాడు. నాలుగోరోజు కోడిపోరు: అలనాడు రెంటచింతల మండలంలోని పాలువాయి వద్ద జరిగిన ఇరురాజ్యాల మధ్య కోడిపోరు దృశ్యాన్ని నేటికీ చూపుతారు. మంత్రాక్షితలతో బ్రహ్మన్న పుంజును నాగమ్మ ఓడేలా చేయటం, రాజ్యం
విడిచి మలిదేవాదులు అరణ్యవాసం పట్టటం ఇందులోని ముఖ్యఘట్టం. ఐదో రోజు కల్లిపాడు: పల్నాటి యుద్ధంలో వీరనాయకులు అసువులు బాయటమే కల్లిపాడు ఉద్దేశం. ముందుగా
ఏర్పాటు చేసిన తంగెడ మండలపై కొణతాలు (దైవాలు) ఒరుగుతాయి. దేవుళ్ళు ఒరిగిన మండల కోసం ప్రజలు ఎగబడతారు. దీంతో వీరారాధనోత్సవాలుముగుస్తాయి.
పీఠాధిపతి: ప్రస్తుతం వీరాచారాన్ని నిలుపుతున్న పిడుగు వంశీకులలోని పిడుగు తరుణ్‌ చెన్నకేశవ అయ్యవారు పిన్న వయస్కుడు. 13 ఏళ్ళ చిరుప్రాయంలోనే పల్నాటి వీరాచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఒకపక్క చదువుతూ తండ్రి బొగ్గరం విజయ్‌ నేతృత్వంలో ఆచారాన్ని కొనసాగిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడు. గ్రామంలో నేటికి అలనాటి చారిత్రక చిహ్నాలు ఉన్నప్పటికి ఆదరించే అధికారులు కానరాక శిథిలావస్థకు చేరాయి.

చెన్నకేశవాలయo:

కారంపూడి చెన్నకేశవాలయాన్ని పల్నాటి బ్రహ్మనాయుడు కట్టించాడు. ఇది పల్నాడులో విశిష్టమైన దేవాలయం. చెన్నకేశవ స్వామిని ప్రతిష్ఠించిన ఈ ఆలయం ఒకపక్కన ఆధ్యాత్మిక చింతన కలిగిస్తూనే, మరోపక్కన పల్నాటి వీరత్వాన్ని ప్రబోధిస్తూ ఉంటుంది. అందుకే ఈ గుడిని గురించి విశేషంగా చెప్పుకుంటారు.కారంపూడి వీరత్వానికి పెట్టింది పేరు. అందుకు తగ్గట్టుగానే, ఈ గుడిలో వీరావేశాన్ని పెంచి పోషించే ఆయుధాలు ఉన్నాయి. చెన్నకేశవాలయం పశ్చిమ ముఖంగా ఉంది. ఈ దేవాలయం గర్భగృహం, అంతరాలయం, మండపం – మూడు భాగాలుగా ఉంటుంది. మండపంలో చెన్నకేశవుని వాహనం గరుత్మంతుడు, బ్రహ్మనాయుడి ఆయుధం-కోతతం, బాలచంద్రుడి ఆయుధం-సామంతం, కన్నమదాసు ఆయుధం-భైరవఖడ్గం ఉంటాయి. ఇక గర్భగుడిలో చెన్నకేశవ స్వామి, రాజ్యలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు.

ఈ చెన్నకేశవాలయం గుంటూరు జిల్లా పల్నాటి సీమ, కారంపూడి గ్రామంలో ఉంది. బ్రహ్మనాయుడి పేరు చెప్పగానే చాపకూడు గుర్తొస్తుంది. కులాల వ్యత్యాసం విపరీతంగా ఉండి, నిమ్న జాతులుగా పరిగణించే కొన్ని కులాలు అవమాన భారంతో కుంగిపోతున్న రోజుల్లో బ్రహ్మనాయుడు చాపకూడు సిద్ధాంతాన్ని అమలుపరిచాడు. అన్ని కులాలవారనీ కూర్చోబెట్టి బంతి భోజనం పెట్టించాడు.కౌరవ, పాండవుల మహాభారత యుద్ధం మాదిరిగానే పల్నాటి యుద్ధ అన్నదమ్ముల మధ్య చెలరేగింది.అంతులేని కల్లోలాన్ని కలిగించి, అశాంతికి దారితీసిన పల్నాటి యుద్ధం కారంపూడిలోనే జరిగింది. ఆ యుద్ధ చిహ్నాలు ఆలయంలో కనిపిస్తాయి. చెన్నకేశవ స్వామినే కాకుండా ఈ ఆయుధాలను కూడా పూజిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *