ఖండాలా అందాలు

Lorem ipsum dolor sit amet,sed diam nonumy eirmod tempor invidunt ut labore et dolore magna aliquyam erat, At vero eos et accusam et justo duo dolores et ea rebum. Lorem ipsum dolor sit amet, no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. Stet clita kasd gubergren, no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. sed diam voluptua.

khandala, maharashtra, mubai pune express

khandala, maharashtra, mubai pune express

Lohagad Fort
Lohagad Fort

మహారాష్ట్ర లోని ముఖ్య పర్వత కేంద్రాలలో ప్రధాన ముఖద్వారం ఖండాలా.  భారతదేశం లో పశ్చిమ భాగంలోని సహ్యాద్రి పర్వత శ్రేణులలో సముద్ర మట్టానికి 625 మీటర్ల ఎత్తులో గల ఈ ప్రాంతం ఒక ముఖ్య పర్యాటక ప్రదేశం. పర్వతారోహకుల స్వప్నమైన కర్జాట్ నించి 7 కిలోమీటర్ల దూరంలో, మరొక అందమైన పర్వత కేంద్రమైన లోనావాలా నుండి 3 కిలోమీటర్ల దూరంలో బోర్ఘాట్ అంచున ఉంది. ఖండాలా బ్రిటీష్ వారి అధీనంలోకి రాకముందు, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ, తర్వాత పీష్వాలు పరిపాలించారు. ఈ ప్రదేశంలో గల చారిత్రక స్థలాలు, కట్టడాలు భారతదేశ సాంస్కృతిక వారసత్వ సంపదకు ప్రతిబింబాలు. సహ్యాద్రి పర్వత శ్రేణులలోని కొండలు, లోయల మధ్య గల ఈ వేసవి విడిది ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిఉంటుంది. పర్యాటకుల కళ్ళు చెదిరే ఆరాధ్యనీయమైన ప్రకృతి సౌందర్యం, పచ్చని కొండలపై ఉత్కంఠభరితమైన దృశ్యాలు, మనోహరమైన లతలు, అందమైన సరస్సులు, సెలయేళ్ల తో ఖండాలా పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

అమృతాంజన్ పాయింట్ డ్యూక్స్ నోస్, రైవుడ్ పార్క్ , బుషీ డాం యాత్రికులకు ఆసక్తి కలిగించే మరికొన్ని ప్రాంతాలు. అపారమైన సహజ వైభవంతో బాటు ఈ పర్వత కేంద్రం కల్గి ఉన్న గుహాలయాలలో కొన్ని క్రీ.పూ. 2 శతాబ్దానికి చెందినవి. బౌద్ధ వాస్తు నిర్మాణానికి ప్రాతినిధ్యం వహించే ఈ ఆలయాలు గతంలో హీనయన శాఖ ఉనికికి సాక్ష్యాలు.

మనోహరమైన లోయలలో నడవడం వల్ల  ప్రకృతి ప్రేమికులకు, ఔత్సాహికులకు ఆ ప్రాంత ఆకర్షణ తెలుస్తుంది. ఖండాలా అపారమైన అందం ను  ఆస్వాదించడానికి విరబూసే వర్షాకాలం అనువైనది. ఈ అందమైన పర్వతాలు పర్వతారోహణ కు అనువైనవి. ప్రావీణ్యం గల వారైనా, ఔత్సాహికులైనా ఏదో ఒక కొండ నుండి పైకి ఎక్కి అక్కడినుండి లోయల అధివాస్తవికత ను చూడవచ్చు. రాళ్ల పై ఎక్కడానికి డ్యూక్ నోస్ పీక్, కర్ల కొండలు ప్రసిద్ద మైనవి.

ఖండాలా ప్రాంతoలో లోహగడ్ అనే ఇనుపకోటను ఖైదీలను బంధించేందుకు నిర్మించారు. ఖండాలా నగరానికి దగ్గరగా గల కునే జలపాతం 100 మీటర్ల ఎత్తు నుండి దుమికే ఒక విశేషం. ఇది పచ్చటి పరిసరాల మధ్య ఉంది.

ప్రాకృతిక అందాలతో నిండిన ఖండాలా లోని పర్యాటక ఆకర్షణలు ఎంతో అద్భుతమైనవి. ఖండాలాలోని వాతావరణం ఏడాది పొడవునా విహారయాత్రకి అనువుగా ఉంటుంది. ఈ పర్వత ప్రాంతం చల్లని వాతావరణం తో విశ్రాంతిదినాల ఆనందాన్ని పెంచుతుంది.

విమాన, రోడ్డు, రైలు మార్గాల ద్వారా ఖండాలా సులువుగా చేరవచ్చు. ముంబై, పూణే లను కలిపే ముంబై – పూణే ఎక్స్ ప్రెస్ ప్రధాన రహదారి ఖండాలా గుండా వెళ్తుంది. నగరాల నుండి ఖండాలాకు  ప్రయాణ సౌలభ్యం ఉండటంవల్ల విశ్రాంతికి, పర్వతారోహణకు ఆకర్షణీయమైన స్థలంగా మారింది . పూణే ఇక్కడికి దగ్గరలోని విమానాశ్రయం కాగా, మహారాష్ట్ర లోని ఇతర ప్రధాన నగరాల నుంచి ఖండాలాకు రైళ్ళు నడుస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *