Thu. Nov 14th, 2019

గుత్తి కోట చాళుక్యులదా..?

Lorem ipsum dolor sit amet,sed diam nonumy eirmod tempor invidunt ut labore et dolore magna aliquyam erat, At vero eos et accusam et justo duo dolores et ea rebum. Lorem ipsum dolor sit amet, no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. Stet clita kasd gubergren, no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. sed diam voluptua.

ananthapur district, Andhrapradesh, chandragiri, gutti fort, tirupati

ananthapur district, Andhrapradesh, chandragiri, gutti fort, tirupati

గుత్తి కోట అనంతపురం జిల్లా గుత్తి పట్టణ సమీపంలోఉంది.  గుత్తి కోట చాళుక్యుల కాలములో కట్టబడినదని భావిస్తారు. విజయనగర రాజులు దీనిని పటిష్ఠము చేసారు. గుత్తి కోటను ప్రస్తావించిన తొలి శాసనాలు కన్నడము మరియుసంస్కృతములో ఉన్నాయి.  అవి 7వ శతాబ్దము నాటివని అంచనా. విజయనగర చక్రవర్తి బుక్క రాయల శాసనములో గుత్తి కోట దుర్గ రాజముగా కీర్తించబడింది.గుత్తి కైఫియత్ ప్రకారo కోటను మీర్ జుమ్లా ఆక్రమించుకొనెను. కోటను 1746 లో మురారి రావు ఆధ్వర్యములో మరాఠులు జయించారు.

1775 లో హైదర్ అలీ గుత్తికోటను తొమ్మిది నెలల నిర్భంధo తర్వాత వశపరచుకొనెను.
1779 లో టిప్పూసుల్తాన్ మరణానంతరము జెరువార్ ఖాన్ అనే సేనాని ఆధీనoలో ఉండగా నిజాoతరఫునబ్రిటిషు కల్నల్ బౌజర్ కోటను ఆక్రమించుకొని బ్రిటిషు వారి పాలనలోకి తెచ్చాడు.  కోట దాదాపు 300 మీటర్ల ఎత్తున ఉంది. కోట నత్తగుల్ల/ శంఖముగవ్వ ఆకారoలోనిర్మించబడిoది.  15 బురుజులతో,15 ముఖద్వారములు కలిగి ఉంది. ఇందులో రెండు శాసనములు, వ్యాయామశాల మరియు మురారి రావు గద్దె ఉన్నాయి. మురారిరావు గద్దె నుండి మొత్తం గుత్తి ఊరంతా చక్కగా కనిపిస్తుంది.

భారతదేశ చరిత్ర గతిని మార్చిన చంద్రగిరి కార్వేటినగరం రాజు ఇమ్మడి యాదవ నరసింహరాయలు క్రీస్తుశకం 1000సం.లో చంద్రగిరి కోటనునిర్మించాడు.విజయనగర సామ్రాజ్య చరిత్రలో చంద్రగిరి కోట ప్రముఖ స్థానం వహించింది. శ్రీక్రిష్ణదేవరాయలు తిరుమలను దర్శించినప్పుడు ఇక్కడే విడిదిచేసేవారు. అచ్యుతదేవరాయలను చంద్రగిరికోటలో నిర్బంధించారు. విజయనగర సామ్రాజ్య సర్వ సైన్యాధ్యక్షుడు(అనధికార రాజు) అరవీటి రామరాయలు , దక్కను ప్రాంత ముస్లింరాజుల సమాఖ్య చేతిలో క్రీ.శ.1565 జనవరిలో రక్కసి-తంగడి యుద్ధంలో కుట్ర-మోసపూరిత హత్యకు గురయ్యాడు. అప్పుడు సదాశివరాయలు చక్రవర్తిగా వుండేవాడు. తమ రాజధానిని పెనుకొండకు మార్చారు. పరిపాలనా సౌలభ్యంకోసం రాజ్యం 3 విభాగాలయింది. శ్రీరంగపట్నo, పెనుకొండ, చంద్రగిరి లు రాజధానులయ్యాయి. బ్రిటీషు ఈస్ట్ ఇండియా కంపెనీకి చెన్నపట్నంలో కోటను కట్టుకోవడానికి1639 ఆగస్టు 22న అనుమతిచ్చింది చంద్రగిరి కోటలో. ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ ఫ్రాన్సిస్ డే తొలుత వచ్చి శ్రీకాళహస్తి మండల పాలకుడు- సామంతుడు దామెర్ల వెంకటాద్రి ని కలిశాడు.

చెన్నపట్నం (చెన్నై) అప్పటి పేరు మైలాపురం. మైలాపురం శ్రీకాళహస్తి మండలంలో వుండేది.95% ప్రజలు తెలుగు మాట్లాడే వారు. శ్రీకాళహస్తి మండల పాలకుడు- చంద్రగిరి సామంతుడు దామెర్ల వెంకటాద్రి. చంద్రగిరి పాలకుడు రెండో శ్రీరంగరాయలు బ్రిటీషు ఈస్ట్ ఇండియా కంపెనీకి1639లో భూమి ఇచ్చినందున బ్రిటీషు వాళ్ళు అధికారికంగా ఒక కోటను కట్టుకొన్నారు. అదే..సెయింట్ జార్జ్ కోట. చెన్నైలో వుంది.తర్వాత బ్రిటీషు వాళ్ళు మొత్తం భారతదేశాన్నంతా తమ పాలన కిందకు తెచ్చుకొన్నారు.ఆ విధంగా చంద్రగిరి ఒప్పందం చేటు తెచ్చింది. ప్రముఖ చారిత్రకపరిశోధకుడు-పాత్రికేయుడు శ్రీ మైనా స్వామి 2002లో తిరుమల-చంద్రగిరి పుస్తకాన్ని రాశారు. రాజమహల్ లో చక్కని మ్యూజియం వుంది. చంద్రగిరి చిత్తూరు
జిల్లా తిరుపతి నుండి 12 కి. మీ. దూరంలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *