ఎర్రగుడిరాళ్ళలో అశోకుని ధర్మ శాసనాలు

Lorem ipsum dolor sit amet,sed diam nonumy eirmod tempor invidunt ut labore et dolore magna aliquyam erat, At vero eos et accusam et justo duo dolores et ea rebum. Lorem ipsum dolor sit amet, no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. Stet clita kasd gubergren, no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. sed diam voluptua.

ananthapur district, Andhrapradesh, ashaoka, red temple

ananthapur district, Andhrapradesh, ashaoka, red temple

కళింగ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత అశోకుడు అహింసావాదిగా మారాడు. యుద్ధంలో దాదాపు లక్షమంది మరణించినట్టు,50వేల మంది గాయపడినట్టు,మరో లక్షమందిని బందీలుగా పాటలీపుత్ర కు పట్టుకుపోయినట్టు ఒరిస్సా-ధవళగిరి శాసనాలు చెబుతున్నాయి. అయితే..భారత దేశ చరిత్రలో ఎర్రగుడి శాసనాలు అత్యంత ముఖ్యమైనవి. సుమారు 258 రోజులపాటు దేశంలో తిరుగుతూ తాను ధర్మ శాసనాలను రాయిస్తున్నట్టు చెప్పుకొన్నాడు అశోకుడు.

అశోక చక్రవర్తి జొన్నగిరి (స్వర్ణగిరి)- ఎర్రగుడి గ్రామాల నడుమ రాతి కొండపై క్రీస్తు పూర్వం 260/259 సం.లో ధర్మ శాసనాలు రాయించాడు.తల్లిదండ్రులను,పెద్దలను ప్రేమించాలని,సత్యం-ధర్మం పాటించాలని, జీవహింస చేయరాదని…పలు ధర్మ-నీతి సూత్రాలను బోధిస్తూ, రాష్ట్రికుడు-రజ్జకుడు అనే స్థానిక అధికారులకు సూచిస్తూ ధర్మ శాసనాలను ఎర్రగుడి పొలాల్లోని నల్లగుట్ట బండరాళ్ళపై అశోకుడు చెక్కించాడు.
శాసనాల పరిశోధన పత్రాన్ని కలకత్తాకు చెందిన ప్రొఫెసర్ డి.సి. సర్కార్ 1957-58 లో ‘ఎపిగ్రాఫియా ఇండియా’లో ప్రచురించారు. అంతకుముందు భారత పురాతత్వ సర్వేక్షణశాఖ తమ వార్షిక నివేదిక 1928-29లో ఎర్రగుడి శాసనాల గురించి పేర్కొనడం జరిగింది. శాసనాలకు A, B, C, D, E, F అని నామకరణం చేశారు. అయితే ఈ శాసనాలు చెక్కిన రాళ్ళు నునుపుదేర్చకుండానే చెక్కారు గనుక అక్షరాలను పోల్చుకోవడం కష్టమయింది. A శిల ఇరవై అడుగుల ఎత్తున కొండ కొనపై ఉంది, దీని కింద భాగం విరిగిపోయింది. ఈ శిల తూర్పు వైపు 17 అడుగుల 6 అంగుళాల వెడల్పుతో అశోకుని ధర్మలిపులలో I, II, III, XIV శాసనాలు కలిగి ఉంది. శాసనాలలిపి బ్రాహ్మీ.అందులోని భాష ప్రాకృతo.

అశోకుని ధర్మ శాసనాల ఎర్రగుడి అనంతపురం మరియు కర్నూలు జిల్లాల్లో పర్యాటకం అభివృద్ధికి దోహదపడుతుంది. ఎర్రగుడి కర్నూలు జిల్లా తుగ్గలి మండలoలోవుంది.అనంతపురం జిల్లా గుత్తి నుంచి ఎర్రగుడి 15 కి.మీ.దూరం. లోవుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *